“సర్కారు వారి పాట” నుంచి ఆ క్లారిటీ కూడా అప్పుడే.?

Published on Jul 9, 2021 2:00 pm IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ సమాచారం ఒకటి బయటకి వచ్చింది. ప్రస్తుతం ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక మహేష్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే.

మరి అందులోనే ఈ సినిమా రిలీజ్ డేట్ అండ్ టైం పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ముందు చెప్పినట్టుగానే సంక్రాంతి రేస్ లోనే ఈ సినిమాని నిలపాలి అని మేకర్స్ అనుకుంటుండగా పరిస్థితుల రీత్యా అది ఎంతవరకు సాధ్యపడుతుంది అన్నవి బేరీజు వేసుకొని అయితే అదే టైం కా లేదా కొత్త రిలీజ్ డేట్ ఏమన్నా ప్రకటిస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఇక ఈ సాలిడ్ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :