బిగ్ బాస్ 4 – ఈ కంటెస్టెంట్ ఓవర్ సింపతీ ప్లే చేస్తున్నాడా.?

Published on Nov 25, 2020 12:59 pm IST

ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మిగిలి ఉన్న కొద్ది మంది కంటెస్టెంట్స్ లోనూ ఒక్కొక్కరికి సంబంధించి మరిన్ని విషయాలు వీక్షకులు గ్రహించగలుగుతున్నారు. అయితే ఇంకొన్ని రోజుల్లో ముగిసిపోయే ఈ షోలో ఫైనల్స్ వరకు చేరాలనే చాలా మంది ఆలోచన. అందుకే ఎంత వరకు అయినా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే ఫైనల్స్ వరకు వెళ్లాలని బాగా గట్టిగా ఫిక్సయిన వారిలో అవినాష్ ఒకడు. ఇతడు మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే కాస్త ఎక్కువగానే టైటిల్ కోసం కానీ షోలో చివరి వరకు కొనసాగాలని ఆశ పడుతున్నాడు. ముఖ్యంగా అయితే సింపతీ ఫ్యాక్టర్ ను మాత్రం ఓ రేంజ్ లో ప్లే చేస్తున్నాడని చెప్పాలి.

నిన్న తాను అలాగే అఖిల్ లకు ఓట్స్ అడిగే ప్రక్రియలో అయితే కాస్త ఎమోషనల్ మార్గాన్నే ఎంచుకొన్నాడు. కానీ ప్రతీసారీ అదే చేస్తుండడం షో వీక్షకులకు కూడా క్లియర్ గా ఇదంతా సింపతీ కోసమే చేస్తున్నాడని అర్ధం అయ్యిపోతుంది. మరి మున్ముందు కూడా ఇలాంటివి చేస్తే కనుక చివరికి మోసపోయేది అవినాషే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More