బిగ్ బాస్ 4 – ఊహించని విధంగా వెనకబడ్డ ఈ కీలక కంటెస్టెంట్.!

Published on Nov 24, 2020 5:30 pm IST

ఇప్పుడు మన తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ సీజన్ 4 మంచి రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఒక్కో వారం గడుస్తున్నా కొద్దీ మరింత ఎంటర్టైన్మెంట్ కూడా వీక్షకులు ఆస్వాదిస్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలి ఉన్న కొద్ది మందీ కంటెస్టెంట్స్ లో మొత్తం నలుగురు నామినేషన్స్ లో ఉన్నారు.

అయితే ఇపుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓ కీలక కంటెస్టెంట్ ఊహించని విధంగా వెనుకబడిపోతున్నారని తెలుస్తుంది. ఆయా కంటెస్టెంట్ మరెవరో కాదు జబర్దస్త్ ఫేమ్ అవినాష్. ఈ కంటెస్టెంట్ నిన్న జరిగిన నామినేషన్స్ లో కూడా కాస్త బ్యాలన్స్ తప్పడం అంతా గమనించారు.

ముఖ్యంగా అవినాష్ లో ఒక భయం అలాగే చిన్నగా క్లారిటీ మిస్సవ్వడం వంటివి తెలుస్తాయి. అందుకే ఈ కంటెస్టెంట్ ఓటింగ్ లో వెనుకబడ్డట్టు తెలుస్తుంది. అది కూడా ఏ రేంజ్ లో అంటే ఇన్నాళ్లు డౌన్ లో ఉండే అరియానా ఓటింగ్ అతన్ని మించి తెచుకుంటుందట. దీనితో మోస్ట్ ఎంటర్టైనర్ కంటెస్టెంట్ గా ఉన్న అవినాష్ కాస్తా వెనకబట్టట్టు అయ్యింది. మరి ముందు రోజుల్లో హౌస్ లో ఏం జరగనుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More