“రాధే శ్యామ్”కు ఈ డీల్స్ ఇంకా నడుస్తున్నాయా.?

Published on May 24, 2021 12:00 am IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం కు ప్రభాస్ ఇప్పుడు చేస్తున్న చిత్రాలతో పోలిస్తే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఒక లెక్కలో ఉంది. అయితే ఇది వరకే షూట్ అంతా కంప్లీట్ అయ్యిపోయిన ఈ చిత్రం మళ్ళీ కొంత రీషూట్ నిమిత్తం మళ్ళీ కొన్ని రోజులు కేటాయించవల్సి వచ్చింది.

అయితే ఈ సమయంలోనే ఈ చిత్రం తాలుకా బిజినెస్ విషయాలు కూడా బయటకి వచ్చాయి. ఆల్రెడీ ఓవర్సీస్ మార్కెట్ కు సంబంధించి బిజినెస్ జరిగిందని టాక్ రాగా దీని డిజిటల్ రైట్స్ పై ఇంకా డీలింగ్స్ నడుస్తున్నట్టే తెలుస్తుంది. ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారే ఈ చిత్రం తాలూకా హక్కులని సొంతం చేసుకోవాలని బాగా ట్రై చేస్తున్నారట. మరి ఈ భారీ పీరియాడిక్ చిత్రం డిజిటల్ స్త్రీమ్మింగ్ హక్కులు ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

సంబంధిత సమాచారం :