బాలయ్యతో రేస్ లో మరో సెన్సేషనల్ డైరెక్టర్?

Published on Sep 29, 2020 11:01 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన ఆల్ టైం హిట్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ అనౌన్స్ కానీ ఈ చిత్రానికి సంబంధించి జస్ట్ చిన్న టీజర్ తో భారీ స్థాయి రెస్పాన్స్ ను రాబట్టుకున్నారు.

బ్యాక్ టు బ్యాక్ బోయపాటికి అవకాశం ఇచ్చిన బాలయ్య లైనప్ లో మళ్ళీ తనకు బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్ చిత్రాలను ఇచ్చిన దర్శకులే ఉన్నారని ఆ మధ్య టాక్ వినిపించింది. బాలయ్య కెరీర్ లో ఆల్ టైం రికార్డు మూవీస్ అందించిన బి గోపాల్ తో ఒక ప్రాజెక్ట్ ను చేయనున్నారని గాసిప్స్ వినిపించగా ఇపుడు మరో దర్శకుని పేరు కూడా వినిపిస్తుంది.

బాలయ్యతో చెన్నకేశవ రెడ్డి లాంటి పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ను తీసిన వి వి వినాయక్ బాలయ్య కోసం ఒక స్క్రిప్ట్ పనిలో ఉన్నారని సినీ వర్గాల్లో లేటెస్ట్ టాక్. ఈ కాంబో కోసం కూడా చాలా మందే ఎదురు చూస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఉందో లేదో అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More