ఆ ఎపిసోడ్ లో ‘వెంకీ మామ’ సూపర్ అంటా !

ఆ ఎపిసోడ్ లో ‘వెంకీ మామ’ సూపర్ అంటా !

Published on Apr 14, 2019 4:54 PM IST

విక్టరీ వెంకటేష్ – యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో వస్తోన్న మల్టీ స్టారర్ ‘వెంకీ మామ’. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది.

కాగా ఈ సినిమాలో పెళ్లి చూపులు ఎపిసోడ్ ఒకటి సినిమాకే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. పెళ్లి చూపుల్లో వెంకటేష్ టైమింగ్ అద్భుతమైన కామెడీని జనరేట్ చేస్తోందని చిత్రబృందం చెబుతుంది. పల్లెటూరి వ్యక్తి పాత్రలో వెంకీ ఈ సినిమాలో కనిపించనున్నాడు.

నాగ చైతన్య వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే ఆ పల్లెటూరి సన్నివేశాలు కూడా చాలా బాగా అలరిస్తాయట. ‘జై లవ కుశ ‘ చిత్ర డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు