“రాధే శ్యామ్” లో ఆ ఎపిసోడ్ అద్భుతంగా.?

Published on Aug 14, 2021 11:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్న చిత్రం ఏదన్నా ఉంది అంటే అది “రాధే శ్యామ్”. పాన్ ఇండియా లెవెల్లో మంచి బజ్ తో అంచనాలు నెలకొల్పుకున్న ఈ ప్రేమకథా చిత్రం అన్ని రకాలుగా కూడా భారీ హంగులతో తెరకెక్కింది. అయితే ఇక ఇటీవలే షూట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రంపై ఆసక్తికర అంశాలే ఇపుడు సినీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. అలా ఈ సినిమాలో ఒక పర్టికులర్ సీన్ కోసం బజ్ వినిపిస్తుంది.

ఈ చిత్రంలో కంప్లీట్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఒక ఇరవై నిమిషాల మేర సన్నివేశం ఉంటుందట. అది సిల్వర్ స్క్రీన్ పై ఫీస్ట్ ఇచ్చే విధంగా ఒక రేంజ్ లో ఉండనుంది అని తెలుస్తుంది. అలాగే ఇందులో ప్రభాస్ కూడా ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తాడని తెలుస్తుంది. ఇప్పటికే రాధే శ్యామ్ లో అలాంటి ఎన్నో అద్భుత సన్నివేశాలు ఉన్నాయని ముందే టాక్ ఉంది. అలాంటి హైలైట్ ఎపిసోడ్స్ లో ఇది ఒకటి అని ఇప్పుడు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో ఎదురు చూడాలి.

సంబంధిత సమాచారం :