“హిట్” హిందీ రీమేక్ లో గ్లామరస్ హీరోయిన్.!

Published on Jul 9, 2021 1:00 pm IST

మాస్ కా దాస్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్” గత ఏడాది విడుదల అయ్యి టైటిల్ కి తగ్గట్టే మంచి హిట్ గా నిలిచింది. మరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను ఈ సినిమాతో ఒక్కసారిగా మంచి ఫేమ్ లోకి వచ్చాడు.

అలాగే ఈ చిత్రం అనంతరం దీనికి సీక్వెల్ ని కూడా అడివి శేష్ తో ప్రకటించి మరింత హైప్ తెచ్చాడు. అయితే ఈ మొదటి చిత్రం బాలీవుడ్ లోకి కూడా వెళ్లనున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో అక్కడి టాలెంటెడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ హీరోగా నటిస్తుండగా ఇప్పుడు హీరోయిన్ ఫిక్స్ అయ్యినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఈ ఇంట్రెస్టింగ్ చిత్రంలో గ్లామరస్ నటి సన్యా మల్హోత్రా ను లాక్ చేసినట్టుగా నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారు తెలిపారు.మరి ఈమె ఇది వరకే అమీర్ ఖాన్ భారీ హిట్ “దంగల్” లో నటించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని అక్కడ ప్రముఖ నిర్మాత అయినటువంటి భూషణ్ కుమార్ కూడా సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :