పవన్ క్రేజీ ప్రాజెక్ట్ కి ఈ హీరోయినే ఫిక్స్.!

Published on Oct 9, 2021 8:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్స్ లో తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తో ప్లాన్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ “భవదీయుడు భగత్ సింగ్” కూడా ఒకటి. ఈ కాంబోలో సినిమా అనౌన్స్ చేసినప్పుడు నుంచి కూడా మంచి అంచనాలు ఉండగా రీసెంట్ గా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని అనౌన్స్ చేసిన తర్వాత మరిన్ని అంచనాలు పెంచుకుంది. ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాపై ఓ టాక్ వైరల్ అవుతుంది.

మొదటి నుంచి కూడా ఈ సినిమాలో పవన్ సరసన ఏ స్టార్ హీరోయిన్ నటిస్తుంది అనే టాక్ దానికి సమాధానంగా పూజా హెగ్డే పేరు వినిపించింది. మరి ఫైనల్ గా కూడా ఆమెనే భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. నిన్ననే హరీష్ చే ఈ విషయం కన్ఫర్మ్ అవ్వడంతో టాక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఈ సినేమానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :