“అయ్యప్పణం” రీమేక్ లో పవన్ కి ఈమెనే ఫిక్స్ అట.!

Published on Jul 6, 2021 2:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో మళయాళ సూపర్ హిట్ అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ మాస్ ఎంటర్టైనర్ లో రానా దగ్గుబాటి కూడా పవర్ ఫుల్ పాత్ర చేస్తున్నాడు. మరి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూట్ లో పవన్ కూడా ఇంకొన్ని రోజుల్లో పాల్గొననుండగా ఇంట్రెస్టింగ్ సమాచారం ఇప్పుడు తెలుస్తుంది.

గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా కనిపించేది ఎవరు అన్న దానిపై సస్పెన్స్ ఉంది. మరి దీనిపై ఎట్టకేలకు క్లారిటీ తెలుస్తుంది. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యా మీనన్ నే కన్ఫర్మ్ అయ్యిందట, అలాగే ఆమె కూడా షూట్ లో పాల్గొననున్నట్టు సమాచారం.

సో గత కొన్నాళ్ల నుంచి సస్పెన్స్ గా నడుస్తున్న అంశానికి ఇప్పుడు సమాధానం దొరికింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా థమన్ సంగీతం ఇస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :