మన ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి వినూత్న దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు గారు కూడా ఒకరు. క్రేజీ ఐడియాలు ఊహించని సబ్జెక్ట్ లతో వచ్చిన సింగీతం గారు నుంచి వచ్చిన తాజా చిత్రమే సింగ్ గీతం. ఎవ్వరూ ఊహించని ఈ ప్రయోగాత్మక సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తన 90ల వయసులో కూడా సింగీతం గారు ఎలా ఈ సినిమాని తీశారు అనేది ఆశ్చర్యంగా మారింది.
అయితే దీనిపై క్రేజీ రివీల్ ఆయన చేశారు. తన కోసం నాగ్ అశ్విన్ సెపరేట్ సెటప్ చేసారని తెలిపారు. తనకి వయస్సు రీత్యా సెట్స్ కి వెళ్లలేకపోయినప్పటికీ లైవ్ లో తను దర్శకత్వం వహించినట్టు తెలిపారు. సెట్స్ నుంచే మైక్ లు, మానిటర్లు సెటప్ ద్వారా నటీనటులుతో సినిమా షూట్ చేసినట్టు తెలిపారు. దీనితో ఈ ప్రయోగాత్మక సినిమాకి ఈ ప్లానింగ్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.


