“రాక్షసుడు 2” లో ఈ విలక్షణ నటుడా..?

Published on Jul 14, 2021 8:56 pm IST

తమిళ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “రాట్సాసన్” తెలుగులో కూడా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. దర్శకుడు రమేష్ వర్మ ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ లతో తెరకెక్కించి వారి కెరీర్ లలో కూడా మంచి విజయాన్ని అందించారు. మరి ఈ చిత్రానికి కొత్తగా కొనసాగింపుగా సీక్వెల్ ని నిన్ననే అనౌన్స్ చేసి మంచి బజ్ క్రియేట్ చేశారు.

అయితే ఫస్ట్ పార్ట్ కి ఏమాత్రం తీసిపోకుండా దీనిని కూడా సిద్ధం చేస్తున్నారని టాక్ ఉండగా మెయిన్ క్యాస్ట్ పై ఇంకా ఎలాంటి కన్ఫర్మేషన్ ను ఇవ్వలేదు. కానీ మెయిన్ లీడ్ లో మాత్రం ఓ విలక్షణ నటుడు నటిస్తున్నాడని టాక్ నడుస్తుంది. అతడు మరెవరో కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అట. తనదైన నటనతో ఎలాంటి రోల్ కి అయినా 101 శాతం జస్టిస్ చేసే సేతుపతి ఈ సినిమా చేస్తున్నాడని నయా గాసిప్స్. మరి దీనిలో ఎంత వరకు నిజముందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :