మహేష్ సొసైటీ కి కాపలా కాసే సైనికుడట…!

Published on Nov 9, 2019 11:40 pm IST

మహేష్ ఈ మధ్య పవర్ ఫుల్ రోల్స్ ఎంచుకుంటున్నారు. భరత్ అనే నేను మూవీలో యంగ్ సీఎం గా చేసిన మహేష్, మహర్షి మూవీలో బిజినెస్ మెన్ పాత్ర చేయడం జరిగింది. ఇక తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరూ మూవీలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరూ మూవీలో మహేష్ ఆఫ్ డ్యూటీ లో కూడా ఆర్మీ ప్యాంట్స్ లో కనిపిస్తున్నారు. ఐతే బోర్డర్ ఆవల ఉన్న శత్రువుల కంటే కూడా మన సొసైటీలో ఉంటూ ఇతరులకు కీడు చేసేవారు చాలా డేంజర్..,వారిని వేటాడటమే నా పని అన్నట్లుగా మహేష్ రోల్ సాగుతుందట.

ఇక ఈ మూవీ సీరియస్ నోట్ లో సాగుతూనే అనిల్ రావిపూడి మార్కు కామెడీ తో అలరిస్తుందట. మహేష్ సరసన రష్మిక మందాన నటిస్తుండగా, లేడీ అమితాబ్ విజయ శాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సరిలేరు నీకెవ్వరూ మూవీ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More