మహేష్-నమ్రతల పెళ్లికి బీజం పడింది అప్పుడే..!

Published on Feb 23, 2020 10:26 am IST

మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరువాత ‘వంశీ’ మూడో చిత్రం. 2000వ సంవత్సరం మిలీనియం ప్రారంభంలో ఆ సినిమా కోసం కలిసిన మహేష్ నమ్రత ప్రేమలో పడిపోయారు. ఐతే వీరి ప్రేమ గురించి 2005లో పెళ్లి చేసుకొనే వరకు ఎవరికీ తెలియదు. చేసింది కేవలం ఒక చిత్రం, మరి ఇంత తక్కువ సమయంలో ఎలా ప్రేమలో పడ్డారు అని అడుగగా, వంశీ చిత్రం కోసం 52 రోజులు అవుట్ డోర్ షూటింగ్ చేశాం. చివరి రోజు ఒకరిని వదిలి మరొకరం ఉండలేం అని అర్థం అయ్యింది. అప్పుడే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చింది అని నమ్రత చెప్పారు. ఇక మహేష్ కి ఆ షూటింగ్ సమయంలోనే నమ్రత తన బెటర్ హాఫ్ అని అర్థం అయ్యిందట. తాజా ఇంటర్వ్యూ లో ఈ ఆసక్తికర విషయాలు ఈ జంట చెప్పుకొచ్చారు.

వీరి వివాహం జరిగి ఇప్పటికి పదిహేనేళ్ళు అవుతుంది. వీరికి గౌతమ్ మరియు సితార ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత యాక్టింగ్ కి బై చెప్పిన నమ్రత గృహిణిగా, మహేష్ సలహాదారుగా అతని జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక సూపర్ స్టార్ గా ఎంత బిజీగా ఉన్నా, మహేష్ కుటుంబానికి చాల ప్రాధాన్యం ఇస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. నమ్రత మహేష్ కంటే నాలుగేళ్లు పెద్దది కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More