ఈ కొత్త సంవత్సరానికి మహేష్ ఎక్కడుంటారో తెలుసా?
Published on Nov 27, 2016 1:42 pm IST

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ ఇటు సినిమాలను, అటు కుటుంబంతో కలిసి సరదాగా హాలిడే ట్రిప్‌లను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూంటారు. సినిమాల నుంచి బ్రేక్ దొరికినప్పుడల్లా మహేష్, కుటుంబంతో కలిసి ఏదో ఒక కొత్త ప్రదేశానికి హాలీడే ట్రిప్ వేస్తూంటారు. ఇక ప్రస్తుతం ఏ.ఆర్.మురుగదాస్‌తో ఓ భారీ బడ్జెట్‍ సినిమా చేస్తోన్న ఆయన, ఆ సినిమా కొత్త షెడ్యూల్‌ను అహ్మదాబాద్‌లో మొదలుపెట్టేశారు. మహేష్, రకుల్ ప్రీత్‍లపై ప్రస్తుతం పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

20 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ పూర్తి కాగానే మహేష్ ఇంగ్లాండ్ టూర్ ప్లాన్ చేశారట. ఈసారి క్రిస్‌మస్, కొత్త సంవత్సర వేడుకలను మహేష్ అక్కడే జరుపుకోనున్నారట. పదిరోజుల పాటు సాగే ఈ ట్రిప్ పూర్తి కాగానే తిరిగి హైద్రాబాద్‌లో షూటింగ్ మొదలుపెడతారు. మార్చికల్లా షూట్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. మహేష్ సరసన రకుల్ ప్రీత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

 
Like us on Facebook