సినిమాల్లోకి పవన్ రీఎంట్రీ వెనుక ట్విస్ట్ ఇప్పుడు బయట పడింది!

Published on Jan 28, 2021 3:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హీరోగా తెలుగు రాష్ట్రాల్లో ఏపాటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అలా అత్యంత ప్రజాధారణ కలిగిన పవన్ జనసేన అనే పార్టీకు కూడా అధ్యక్షలు అని సంగతి కూడా తెలిసిందే. మరి ఇదిలా ఉండగా తాను పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా పరిస్థితుల అనుసారం పాలిటిక్స్ మరియు సినిమాలు చేస్తూ వచ్చారు. కానీ ఓ సమయంలో పూర్తిగా సినిమాలు వదిలేసానని చెప్పి పూర్తిగా రాజకీయాల్లోకి దిగారు.

కానీ మళ్ళీ అనూహ్యంగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో ఓ పక్క పూలు పడ్డాయి రాళ్ళూ పడ్డాయి. పవన్ మాట పై నిలబడడు అని అందరికీ తెలిసిందే ఎప్పటికైనా మళ్ళీ సినిమాలే చేస్తాడు అని ఆ టైం లో విమర్శలు ఎదురయాయ్యి. కానీ అసలు పవన్ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం స్వయానా పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవే అని జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ ఓ మీటింగ్ లో చెప్పడం కాక పుట్టిస్తుంది.

తాము ఓ సందర్భంలో కలిసినప్పుడు పవన్ మళ్ళీ సినిమాలు చెయ్యాలని చిరునే సూచించారని అందుకే మళ్ళీ పవన్ సినిమాలు స్టార్ట్ చేసారని అందులో తెలిపారు. ఇక ఇదే కాకుండా మున్ముందు కూడా చిరు తన మద్దతు పవన్ కు అందిస్తారని కూడా మనోహర్ చెప్పడం మార్ చర్చకు దారి తీసింది. మరి మొత్తానికి మాత్రం పవన్ రీఎంట్రీ వెనుక ఉన్న సాలు ట్విస్ట్ ఏంటి అన్నది ఇప్పుడు రివీల్ అయ్యింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

More