ఆర్ఆర్ఆర్ టైటిల్ బట్టి కథ చెప్పేసిన వినాయక్.

Published on Mar 26, 2020 8:00 pm IST

నిన్న రాజమౌళి విడుదల చేసిన ఆర్ ఆర్ ఆర్ మోషన్ పోస్టర్ సంచలనం రేపింది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్ మోషన్ పోస్టర్ మరియు టైటిల్ లోగోకు ఫిదా అయ్యారు. ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి మరో విజువల్ వండర్ అందించనున్నారంటూ ఫిక్స్ అయిపోయారు. ఇక ఈ మోషన్ పోస్టర్ టైటిల్ రౌద్రం రణం రుధిరం చూసిన సినిమా పండితులు తమ నచ్చిన కథలు చెప్పుకొస్తున్నారు.

కాగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ టైటిల్ అండ్ మోషన్ పోస్టర్ ఆధారంగా సినిమాపై తన వర్షన్ వినిపించారు. టైటిల్‌లో ఉన్న రౌధ్రం, రణం, రుధిరం అర్థం ఏమిటో వివరించారు. బ్రిటీష్ ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకిస్తూ ఉద్భవించిన ‘రౌద్రం’. ఈ ఇద్దరూ కలిసి చేయాలనుకున్నది ‘రణం’ అని, ఆ యుద్ధంలో వాళ్లు అర్పించినది ‘రుధిరం’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్ ఆర్ ఆర్ విషయంలో ఆయన వర్షన్ అదిరింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :

X
More