సరిలేరు నీకెవ్వరు చిత్రం నుండి వస్తున్న నెక్స్ట్ సాంగ్ ఇదే..!

Published on Dec 8, 2019 12:43 am IST

సంక్రాంతి బరిలో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ దిగుతున్న సంగతి తెలిసిందే. విడుదల సమయం దగ్గిరపడుతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టారు. గత నెలలో టీజర్ విడుదల చేసిన చిత్ర బృందం ఈనెలలో ప్రతి సోమవారం ఒక సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. గత సోమవారం ఈ చిత్రం నుండి ఓ మాస్ మసాలా ఐటెం సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ కు మంచి ఆదరణ లభించింది. ఇక రెండవ సాంగ్ గా వచ్చే సోమవారం అనగా 9వ తేదీన ఒక పాట విడుదల చేస్తున్నారు. సూర్యుడివో..చంద్రుడివో అని సాగే ఈ పాట రేపు విడుదల కానుంది.

మహేష్ పాత్ర స్వభావం, ఔన్నత్యం తెలిసేలా రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రచించారు. శ్రీమంతుడు సినిమాలో పోరా శ్రీమంతుడా…, అలాగే భరత్ అనే నేను సినిమాలో, వచ్చాడయ్యో సామి.., పాటల తరహాలో ఈ సాంగ్ ఉంటుందని సమాచారం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన మహేష్ కి జోడిగా మొదటిసారి నటిస్తుంది. 2020జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదల అవుతుంది.

సంబంధిత సమాచారం :

X
More