నితిన్ పెళ్లి లేటైంది అందుకేనట

Published on Feb 19, 2020 10:45 pm IST

హీరో నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆయన తన ప్రేయసి షాలిని ని కొద్దిరోజులలో పెళ్లి చేసుకోనున్నారు. ఐతే భీష్మ ప్రమోషన్స్ లో పాల్గొన్న నితిన్ పెళ్లి లేట్ అయినట్లుంది అని అడుగగా ఆయన ఆసక్తికర సమాధానం చెప్పారు. నిజానికి షాలిని ని నితిన్ మూడేళ్ళ క్రితమే పెళ్లి చేసుకోవలసిందిట. ఐతే తను మెంటల్ గా ప్రిపేర్ కావడానికి ఇంత సమయం పట్టిందట. పెళ్లి అనేది పెద్ద బాధ్యత గదా అని చెప్పుకొచ్చారు. షాలిని, నితిన్ కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు.

ఇక నితిన్ నటించిన భీష్మ మూవీ ఈనెల 21న విడుదల కానుంది. దర్శకుడు వెంకీ కుడుముల రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నితిన్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. భీష్మ చిత్రానికి సంగీతం మహతి స్వర సాగర్ అందించారు.

సంబంధిత సమాచారం :

X
More