దీపావళికి మహేష్ ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏమిటంటే…!

Published on Oct 23, 2019 12:02 pm IST

దీపావళి కానుకగా మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీ నుండి తన అభిమానులకు ఇస్తున్న సర్ప్రైజింగ్ గిఫ్ట్ పై ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. అదేమిటంటే దీపావళి సందర్భంగా సరిలేరు నీకెవ్వరూ మూవీ నుండి లేడీ అమితాబ్ విజయ శాంతి లుక్ విడుదల చేస్తున్నారు. సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో విజయ శాంతి రాయలసీమకు చెంది పవర్ ఫుల్ లేడీ రోల్ చేస్తుండగా, ఆమె పాత్ర ను దీపావళికి పరిచయం చేయనున్నారు. దాదాపు 13ఏళ్ల తరువాత ముఖానికి మేకప్ వేసుకున్న విజయశాంతి ఎలా ఉంటారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

2006లో నాయుడమ్మ చిత్రం తరువాత పొలిటికల్ గా బిజీ అయిన రాములమ్మ సినిమాల వైపు కన్నెత్తి చూసింది లేదు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఆమె సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, రష్మిక మందాన మొదటి సారి మహేష్ తో జత కట్టింది. దేవిశ్రీ సంగీతం అందించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

X
More