వరుణ్ పెళ్లిపై నాగబాబు కామెంట్!

Published on Jan 24, 2021 5:10 pm IST

నాగబాబు కూతురు నిహారిక పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఐదురోజులు నిహారిక పెళ్లి ఘనంగా జరిగింది. మెగా హీరోలందరూ పాల్గొన్న ఈ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. జొన్నలగడ్డ వెంకట చైతన్యతో నిహారిక ఏడడుగులు వేశారు. నిహారిక పెళ్లి అనంతరం వరుణ్ పెళ్లి కూడా ఉంటుందని నాగబాబు గతంలో చెప్పిన నేపథ్యంలో, వరుణ్ కూడా త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నాడన్న పుకార్లు మొదలయ్యాయి.

కాగా వరుణ్ వివాహంపై తండ్రి నాగబాబు స్వయంగా స్పందించారు. వరుణ్ ప్రేమ వివాహం చేసుకుంటారా లేక పెద్దల కుదిర్చిన వివాహం చేసుకుంటారా… అని యాంకర్ అడుగగా. దానికి నాగబాబు అది తన ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. మేము అమ్మాయి అన్నివిధాలా వరుణ్ కి సరిజోడీనా కాదా అన్నదే చూస్తాం. అమ్మాయి మంచిదైతే చాలు ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిందా అనే పట్టింపులు లేవు అన్నారు. అయితే వరుణ్ పెళ్లి ఎప్పుడు అనే విషయం పై స్పష్టత మాత్రం ఇవ్వలేదు ఆయన. ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నగని చిత్రంలో నటిస్తున్నారు. వరుణ్ బర్త్ డే నాడు విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం :