ఓటీటీ లోకి వచ్చాక డబ్బింగ్ వెర్షన్స్ కి రెస్పాన్స్ ఇదే!

ఓటీటీ లోకి వచ్చాక డబ్బింగ్ వెర్షన్స్ కి రెస్పాన్స్ ఇదే!

Published on Jan 31, 2026 12:02 PM IST

Dhurandhar

బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా సారా అర్జున్ హీరోయిన్ గా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఇంటెన్స్ స్పై యాక్షన్ చిత్రం ధురంధర్ కోసం ఇప్పుడు మరోసారి ఆడియెన్స్ అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇది వరకు కేవలం హిందీలోనే వచ్చి దుమ్ము లేపిన ఈ సినిమా లేటెస్ట్ గా ఓటీటీలో హిందీతో పాటుగా తెలుగు, తమిళ్ భాషల్లో కూడా వచ్చింది. ఇక ఈ సినిమాకి డబ్బింగ్ వెర్షన్ లలో కూడా క్రేజీ రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి వస్తుంది.

తెలుగు ఆడియెన్స్ లో ముందు నుంచి మంచి ఫీడ్ బాక్ ఉంది. అలా కొత్తగా చూసిన ఆడియెన్స్ ని కూడా ఈ సినిమా మెప్పిస్తుండగా తమిళ ఆడియెన్స్ కూడా ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనితో ధురంధర్ ఓటీటీ లోకి వచ్చాక అది కూడా ఇతర భాషల ఆడియెన్స్ లో హిట్ గా అనిపించుకుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాడ్ హిట్ సీక్వెల్ ఈ మార్చ్ 19న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదల కానుంది.

తాజా వార్తలు