అప్పుడు చేయలేనివి, ఇప్పుడు చేసేస్తున్న టాలీవుడ్ హీరోలు

Published on Apr 6, 2020 11:00 pm IST

ఎప్పుడూ చూడని కొత్త దృశ్యాలు, సంఘటనలు, పరిస్థితులు కరోనా వైరస్ కొద్దిరోజులుగా చూపిస్తుంది. మనిషిని మనిషి తాకాలంటే భయం, బయటికి వెళ్లాలంటే భయం, దేనిని ముట్టుకోవాలన్నా, స్వేచ్ఛగా గాలి పేల్చాలన్న భయపడే స్థితిలో ప్రపంచం ఉంది. ఇక ఎప్పుడూ తీరిక లేకుండా గడిపే స్టార్ హీరోలు ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇంటిలో కుటుంబంతో గడుపుతున్నారు. ఇప్పటి వరకు చూద్దామనుకొని చూడలేనివి, చేద్దామనుకొని చేయలేనివి చేస్తున్నారని సమాచారం.

చాల మంది హీరోలు పిల్లలతో గేమ్స్ అడ్డుకోవడంతో పాటు సినిమాలు ఎక్కువగా చూసేస్తున్నారట. కొంత మంది హీరోలు తమకు ఇష్టం వచ్చిన పుస్తకాలను చదివేస్తున్నారట. ఇక చిరంజీవి అయితే తన ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నారట. తన జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలను సేకరిస్తున్నారట. కొన్ని ఆసక్తికర వీడియోలు కూడా ఆయన ఆటోబయోగ్రఫీ కొరకు రూపొందిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఏ వ్యాపకం తోచని హీరోలు మాత్రం లాక్ డౌన్ పోతే షూటింగ్ కి వెళదామనే ఫస్ట్రేషన్ లో ఉన్నారట.

సంబంధిత సమాచారం :

X
More