మహేష్ సెట్స్‌లో అడుగు పెట్టే రోజు అదే !

Published on Nov 29, 2022 12:56 am IST

సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం కారణంగా త్రివిక్రమ్ – మహేష్ కలయికలో వస్తోన్న ‘SSMB28’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిపివేయబడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే, తాజాగా టీమ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, మహేష్ డిసెంబర్ 8వ తేదీ నుండి ఈ సినిమా సెట్స్‌లోకి జాయిన్ అవుతాడు. హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించి, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ కి హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మొత్తానికి పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం :