పుష్ప మూవీ నుండి అందుకే తప్పుకున్నా..!

పుష్ప మూవీ నుండి అందుకే తప్పుకున్నా..!

Published on Jul 14, 2020 9:10 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. దీనితో అన్ని పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులను ఈ చిత్రం కోసం తీసుకుంటున్నారు. ఐతే ఈ మూవీలో ఓ కీలక రోల్ కోసం వర్సిటైల్ యాక్టర్ విజయ్ సేతుపతిని తీసుకోవడం జరిగింది. ఐతే తరువాత విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

విజయ్ సేతుపతి పుష్ప మూవీ నుండి తప్పుకోవడానికి ఆయన కారణం రెమ్యూనరేషనే అని అప్పుడు ప్రచారం జరిగింది. ఐతే ఈ విషయంపై విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. పుష్ప నుండి తప్పుకోవడానికి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కారణం అని ఆయన తెలియజేశారు. ఇక పుష్ప మూవీలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుండగా…దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు