ట్రీట్ ఇచ్చే సీన్ లో “ఆచార్య”..?

Published on Feb 23, 2021 8:01 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్సకత్వంలో “ఆచార్య” అనే భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాగే ఈ భారీ చిత్రంలో మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలో ఓ కీలక సన్నివేశ నిమిత్తం ఈ ఇద్దరు మెగా హీరోలు కూడా మారేడుమిల్లి అడవుల ప్రాంతానికి తరలి వెళ్లారు. అయితే మరి ఇక్కడ డిజైన్ చేసిన సీన్ సినిమా అభిమానులకు ట్రీట్ ఇచ్చేలానే ఉంటుందని తెలుస్తుంది. ఈ ఇద్దరు ఇప్పుడు ఓ ఫైట్ సీక్వెన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారట.

అంతే కాకుండా ఆల్రెడీ ఆ పోరాట సన్నివేశంలోనే పాల్గొంటున్నారని కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ సీన్ ఇద్దరికీ మధ్యన ఉంటుందా లేక కలిపి ఉంటుందా అన్నది ఆసక్తిగా మారింది. మరి ఈ మిస్టరీ రివీల్ అవ్వాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇక ఈ భారీ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :