“రాధే శ్యామ్” నుంచి ఇప్పుడప్పుడే వచ్చేలా లేదు!

Published on Sep 3, 2021 7:05 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. భారీ హంగులతో అత్యున్నత ప్రమాణాలతో దర్శకుడు రాధా కృష్ణ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంపై అప్పుడప్పుడు ఒక సర్ప్రైజింగ్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ వస్తున్న మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఈ చిత్రాన్ని నిలపాలని సిద్ధం చేశారు. అయితే వీటిని పక్కన పెడితే ఈ సినిమా పై మోస్ట్ అవైటెడ్ గా ఓ అప్డేట్ నిలిచింది.

అదే ఈ సినిమా ఫస్ట్ సింగిల్.. పర్టిక్యులర్ గా ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. జస్టిన్ మరియు హిందీ కంపోజర్స్ మిథున్, మనన్ భరద్వాజ్ లు ఇచ్చిన ఈ ఫస్ట్ సింగిల్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సెప్టెంబర్ లో ఉండొచ్చేమో అని బజ్ వినిపించింది కానీ తాజా సమాచారం కూడా ఇప్పుడప్పుడే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. మరి వీటన్నిటినీ ఎప్పుడుకి ప్లాన్ చేస్తారో అన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత సమాచారం :