“రాధే శ్యామ్” లో ఆ అద్భుతమైన సీక్వెన్స్ హైలైట్ అట.!

Published on May 23, 2021 1:58 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. పూర్తిగా స్వచ్ఛమైన ప్రేమ కావ్యంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్నారు. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రంలో పలు కీలక సన్నివేశాలకు భారీ బడ్జెట్ ను మేకర్స్ వెచ్చించారు.

అలా ప్లాన్ చేసిన ఒక అద్భుతమైన సన్నివేశం కోసమే ఇపుడు ఓ ఆసక్తికర వార్త బయటకి వచ్చింది. ఈ చిత్రంలో ఒక భారీ షిప్ సెట్ లో ఒక ముప్పై నిమిషాల పాటు తెరకెక్కించిన సన్నివేశం ఈ చిత్రంలోనే బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుంది అని తెలుస్తుంది. దీనితో ఈ చిత్రంపై అంచనాలు మరో స్థాయికి వెళ్లాయని చెప్పాలి.

ఇది వరకే ఈ సినిమాపై మేకర్స్ ఇస్తున్న హింట్స్ నిమిత్తం రాధే శ్యామ్ ఇండియన్ టైటానిక్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యిపోయారు. మరి ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే ఓ భారీ షిప్ సెట్ లో మంచి సన్నివేశం ప్రేక్షకులను అబ్బురపరిచే విధంగా అంటే అసలు అంచనాలు పెట్టుకోకుండా ఉంటారా? మరి ఈ సన్నివేశం సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :