“సర్కారు వారి పాట” నుంచి ఈ ట్రీట్ కూడా.?

Published on May 26, 2021 8:48 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే గత ఏడాది ఇదే మే నెలాఖరున ప్రీ లుక్ తోనే సెన్సేషన్ సెట్ చేసిన మహేష్ ఈసారి ఫస్ట్ లుక్ పోస్టర్ తో రావడం కన్ఫర్మ్ అయ్యింది. ఇది తెలిసిందే.

అయితే దానికి ఆల్రెడీ భారీ ప్లాన్స్ సెట్ చేసుకున్న ఫ్యాన్స్ నిన్న ట్విట్టర్ బ్యాన్ అనే టాక్ రావడంతో కాస్త ఖంగారు పడ్డారు. కానీ ఎలాంటి బ్యాన్ లేదు అని తెలిసేసరికి ఫస్ట్ లుక్ పోస్టర్ కి మాస్ రికార్డ్స్ సెట్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. అయితే అదే మే 31 సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా ఎప్పటి నుంచో ఊరిస్తున్న మేకింగ్ వీడియో కూడా రావడం ఖరారు అయ్యినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

దానిని కూడా ఒక పర్ఫెక్ట్ కట్ గా చేసి టీజర్ పై మరిన్ని అంచనాలు పెంచేదిలా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :