‘భీమ్లా నాయక్’ నుంచి రానున్న సాలిడ్ అప్డేట్స్ ఇవేనా!

Published on Aug 7, 2021 6:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రం “అయ్యప్పణం కోషియం” రీమేక్ పై సాలిడ్ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మేకర్స్ కూడా పలు అదిరే అప్డేట్స్ తో మరింత ఆసక్తి రేపుతున్నారు. ఇక ఇదిలా ఉండగా ఆల్రెడీ ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ మరియు రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఫస్ట్ సింగిల్ లాంచ్ పై డేట్ ఇంకా రావాల్సి ఉంది..

కానీ ఈ చిత్రంపై మరి ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. దాని ప్రకారం బహుశా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్ పై ఒక అధికారిక క్లారిటీ ఈ నెలలో వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పవన్ చేస్తున్న భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ రోల్ పై గట్టి అంచనాలు ఏర్పడ్డాయి.

దీనితో ఫుల్ ఫ్లెడ్జ్ గా టైటిల్ ఏమిటి ఉంటుంది అన్నది మరింత ఆసక్తి నెలకొంది. మరి ఈ అప్డేట్స్ ఎప్పుడు రానున్నాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :