మహేష్ బర్త్ డే కి మరో స్పెషల్ అప్డేట్ ఉందా.?

Published on Aug 8, 2021 9:00 pm IST

ప్రస్తుతం సౌత్ ఇండియన్ సోషల్ మీడియా అంతా సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే వైబ్స్ తోనే నిండి ఉంది. భారీ ఎత్తున ఆఫ్ లైన్ మరియు ఆన్లైన్ ప్లానింగ్స్ తో రేపు మహేష్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో పుట్టినరోజుని పండుగల జరపాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ స్పెషల్ డే ని మరింత స్పెషల్ చేస్తూ తన లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట” నుంచి కూడా భారీ అప్డేట్స్ వస్తున్నాయి.

మరి ఇప్పుడు మరో టాక్ కూడా ఇపుడు వినిపిస్తుంది. మహేష్ ఆ చిత్రం తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నుంచి కూడా ఒక స్పెషల్ అప్డేట్ రానున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అయితే అది ఒక వీడియో అని టాక్ నడుస్తుంది. దీనితో ఈ అప్డేట్ ఏంటి అన్న దాని కోసం మహేష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :