చాలా కాలం తర్వాత బాలీవుడ్ మార్కెట్ మళ్ళీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. ఇప్పుడు వరుసగా భారీ హిట్స్ బాలీవుడ్ లో ఈ ఏడాది పఠాన్ నుంచి నమోదు కాగా ఇదే షారుఖ్ ఖాన్ నటించిన భారీ హిట్ సిరీస్ “డాన్” కి రెండో సీక్వెల్ ని దర్శకుడు ఫర్హాన్ అక్తర్ అయితే టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ తో “డాన్ 3” ని స్టార్ట్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.
ఇక దీనిపై భారీ అంచనాలు అయితే నెలకొనగా ఈ చిత్రంలో హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తుంది. మొదటగా ఈ చిత్రంలో రణ్వీర్ సరసన గ్లామరస్ హీరోయిన్ కియారా అద్వానీ ఫిక్స్ అయ్యినట్టుగా టాక్ వైరల్ గా మారింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే “డాన్ 3” లో కియారా ప్లేస్ లో మరో స్టార్ బ్యూటీ కృతి సనన్ లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ క్రేజీ కాంబినేషన్ పై టాక్ బాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారింది.
