సైక్లింగ్ చేస్తూ రోడ్ పై దర్శనమిచ్చిన స్టార్ హీరో.!

Published on Feb 25, 2021 7:13 pm IST


మన దక్షిణాదిలో మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కూడా ఒకరు. మన దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకు వారికి ఉన్న ఫాలోయింగ్ రేంజ్ లో అజిత్ కు అక్కడ ఉంటుంది. అయితే ఇప్పుడు అజిత్ కూడా తన మార్కెట్ ను మన దగ్గర పెంచుకునే పనిలో ఉన్నాడు. అందుకే తన నెక్స్ట్ సినిమా “వాలిమై”ను పాన్ ఇండియన్ లెవెల్లో ప్లాన్ చేస్తూ అన్ని కీలక చోట్లా షూట్ ను జరుపుకుంటున్నారు.

అలా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న అజిత్ సడెన్ గా రోడ్ పై సైక్లింగ్ చేస్తూ ప్రత్యక్షం అయ్యారు. దీనితో ఈ సడెన్ ట్విస్ట్ ను చూసి తమిళ నాట అజిత్ ఫ్యాన్స్ షాకయ్యారు. మన దగ్గర కాబట్టి అక్కడి స్టార్ హీరో ఇలా కనిపించినా ఎవరికీ తెలియలేదు. అదే అక్కడ కనుక అయ్యుంటే సీన్ మరో విధంగా ఉండేది అని చెప్పాలి. మరి అజిత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమాకు హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని బావువ్డ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :