నితిన్, వంశీ ప్రాజెక్ట్ కి ఈ స్టార్ హీరోయిన్ పేరు..?

Published on Jul 7, 2021 8:19 pm IST

మన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ హీరోగా పలు ఆసక్తికర సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వాటిలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “మాస్ట్రో” డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కానుంది అని తెలిసింది. అయితే తన కెరీర్ లో మునుపెన్నడూ లేని ఇంట్రెస్టింగ్ లైనప్ తో వస్తున్న నితిన్ ప్రముఖ స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ వక్కంతం వంశీ తో కూడా మరో ఆసక్తికర ప్రాజెక్ట్ ను చేస్తున్నాడని కూడా టాక్ ఉంది.

మరి ఇప్పుడు ఈ సినిమా క్యాస్టింగ్ పైనే ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో నితిన్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటించనుందట.. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు కానీ టాక్ మాత్రం బయటకి వచ్చింది. మరి ఈ కాంబో వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది. మరి రియల్ టైం లో ఎంత వరకు సాధ్యం అవుతుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :