“పుష్ప”లో అడుగు పెట్టిన విలక్షణ నటుడు.!

Published on Apr 20, 2021 12:00 pm IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో భారీ రెస్పాన్స్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. మరి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒకటి వినిపిస్తుంది. ఈ మధ్యనే ఈ చిత్రంలో విలన్ రోల్ కు తీసుకున్న విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ ఈ చిత్రానికి తన షూట్ నిమిత్తం సెట్స్ లో అడుగు పెట్టినట్టు తెలుస్తుంది.

మళయాళంలో తన సినిమాలతో మన దగ్గర కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఈ నటుడు ఈ సినిమాలో బన్నీకి విలన్ గా చేస్తున్నాడన్న వార్త రావడంతో ఈ కాంబోపై మరిన్ని అంచనాలు సెట్టయ్యాయి. మరి ఆన్ స్క్రీన్ పై వీరి బ్యాటిల్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :