“RRR” రిలీజ్ పై కంటిన్యూ అవుతున్న టాక్.!

“RRR” రిలీజ్ పై కంటిన్యూ అవుతున్న టాక్.!

Published on Aug 12, 2021 1:00 PM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి “రౌద్రం రణం రుధిరం” అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పాన్ ఇండియన్ లెవెల్లో రచ్చ చెయ్యడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఇప్పుడు ఉక్రెయిన్ దేశంలో షూట్ తో బిజీగా ఉంది. అలాగే అధికారికంగా పలు సాలిడ్ అప్డేట్స్ ని కూడా ఎప్పటికపుడు ఇస్తూ హైప్ ని పెంచుకుంటూ వస్తుంది.

అయితే ఈ చిత్రంపై కొన్ని రోజులు నుంచి మళ్ళీ రిలీజ్ డేట్ రచ్చ నడుస్తుంది. మేకర్స్ మాత్రం వచ్చే అక్టోబర్ 13 కే ఫిక్స్ చేసినా సినీ వర్గాల్లో మాత్రం టాక్ ఇంకోటి నడుస్తుంది. ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కష్టమే అని సంక్రాంతి రేస్ కి షిఫ్ట్ అయ్యిందని ఊహాగానాలు కంటిన్యూ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో కానీ మరో అధికారిక అప్డేట్ వస్తే కానీ క్లారిటీ వచ్చేలా లేదు..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు