బిగ్ బాస్ – ఈ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్ అలా పెరుగుతుందా?

బిగ్ బాస్ – ఈ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్ అలా పెరుగుతుందా?

Published on Nov 15, 2020 5:00 PM IST

Bigg Boss 4

మొత్తం దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో అయినటువంటి బిగ్ బాస్ మన తెలుగులో కూడా మంచి ఆదరణను రాబట్టుకుంది. ప్రతీ సీజన్ కు కూడా రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ను ఇస్తూ అదరగొడుతున్న ఈ గ్రాండ్ షోలో ప్రతీసారి కొంత మంది కంటెస్టెంట్స్ అలా టాప్ 5 స్థానంలో కొనసాగుతూ వస్తుంటారు.

వారి ప్రతీ నామినేషన్స్ లో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి ఫాలోవర్స్ చేసేస్తుంటారు. అలా ఈసారి కూడా నాలుగో సీజన్లో కొంత మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. కానీ వారిలో మాత్రం “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” ఫేమ్ అభిజీత్ కు మాత్రం బిగ్ బాస్ వీక్షకుల్లో ఆదరణ గ్రాఫ్ అలా స్థిరంగా కొనసాగుతూ అంతకంతకు పెరుగుతుందని చెప్పాలి.

లేటెస్ట్ గా అయితే సోషల్ మీడియాలో అభిజీత్ పేరిట ఒక సాలిడ్ ట్రెండ్ ను కూడా చేసారు. అది కూడా ఇది వరకు ఏ తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కూడా పడనన్ని ట్వీట్స్ తో చేసారు. హ్యాపీ దివాళీ టు అభిజీత్ అనే హ్యాష్ ట్యాగ్ తో 40 వేలకు పైగా ట్వీట్స్ చేసి సరికొత్త రికార్డ్ ను సెట్ చేశారు. మొత్తానికి మాత్రం అభిజీత్ తన నిలకడను అలా కొనసాగితున్నాడని చెప్పాలి. మరి ఫైనల్స్ వరకు వెళ్లగలడో లేదో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు