బిగ్ బాస్:ఏదైనా జరగొచ్చు, ఎవ్వరైనా కావొచ్చు…?

Published on Oct 12, 2019 4:12 pm IST

గత ఎలిమినేషన్స్ తో పోల్చుకుంటే ఈ వారపు బిగ్ బాస్ ఎలిమినేషన్స్ పై ఆసక్తితో పాటు, ఉత్కంఠ చోటు చేసుకుంది. దానికి కారణం నామినేషన్స్ లో ఉన్న వరుణ్, రాహుల్, మహేష్ ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడంతో పాటు, బటయ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవారు కావడమే. గత కొద్దిరోజులుగా మహేష్ విట్టా ఎలిమినేట్ కానున్నారంటూ ప్రచారం జరిగినది. బిగ్ బాస్ షో ఎలిమిటేషన్స్ ఇప్పటివరకు ముందుగా ప్రచారం జరిగినట్టుగానే జరిగింది. కానీ ఈ వారం ఎలిమినేషన్స్ ఊహాతీతంగా ఉండొచ్చని చాలా మంది అంచనా.

కాగా ఓటింగ్ విషయంలో కూడా ఈ ముగ్గురి మధ్య టఫ్ కాంపిటీషన్ నడుస్తుందని సమాచారం. ఒక వర్గం ముఖ్యంగా మహేష్ విట్టా ను ఎలాగైనా గెలిపించాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. అసలు లేటెస్ట్ బజ్ ప్రకారం మహేష్ షో విన్నర్ గా కూడా నిలిచే అవకాశం కలదు అంటున్నారు. నేటి షో తో ఎలిమినేషన్ పై కొంత క్లారిటీ వస్తుంది. ఇక రేపు ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్లిపోనున్నారనేది తెలిసిపోతుంది. ఏదేమైనా ఈ సారి ఎలిమినేషన్ మాత్రం ఏదైనా జరగొచ్చు?, ఎవరైనా కావచ్చు? అన్నట్లుగా సాగనుంది.

సంబంధిత సమాచారం :

More