బిగ్ బాస్ 4 – ఈసారి ఎలిమినేషన్ మరింత టఫ్ గా ఉంటుందా.?

Published on Dec 2, 2020 11:04 am IST

లేటెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన నామినేషన్స్ ఏ రేంజ్ లో అయ్యాయో తెలిసిందే. దీనితో ఈ నామినేషన్స్ చూసి ఆరోజే ఎవరిని బిగ్ బాస్ ఇంటి నుంచి తమ ఇంటికి పంపించేయాలో అన్నది కూడా షో రెగ్యులర్ ఫాలోవర్స్ ఫిక్సయ్యిపోయారు. అయితే ఈసారి బిగ్ బాస్ వోటింగ్ లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది.

మొదటి నుంచి మంచి స్ట్రాంగ్ గా కొనసాగుతున్న అభిజీత్ మరియు అఖిల్ లు ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉండగా మిగతా ముగ్గురు విషయంలోనే టఫ్ గా ఉండనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అవినాష్ ఎలాగో మొదటి నుంచి తక్కువ ఓటింగ్ తోనే ఉన్నాడు అలాగే ఆ మధ్య గ్రాఫ్ ను పెంచుకొని మళ్ళీ డౌన్ అయిన మోనాల్ కు కూడా మళ్ళీ తగ్గినట్టు తెలుస్తుంది.

అయితే వీరిద్దరికీ స్వల్పమైన తేడానే వస్తుందట. దీనితో సింగిల్ ఎలిమినేషన్ ఉంటుందా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అన్నది మరోసారి రైజ్ అయ్యింది. అలాగే మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే వీరితో పాటు నామినేషన్స్ లో ఉన్న హరికకు కూడా తక్కువ ఓట్లే పడుతున్నాయట. మరి ఈ వారాంతానికల్లా తక్కువ ఓట్లుతో నెటిజన్లు ఎవరిని ఇంటికి పంపించేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More