స్ట్రగులింగ్ హీరో క్రైమ్ థ్రిల్లర్ తో వస్తాడట …?

Published on Nov 19, 2019 7:15 am IST

సుమంత్ హీరోగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు ‘క‌ప‌ట‌ధారి’ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌, మోష‌న్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ట్విట్టర్ ద్వారా ‘కపటధారి’ మోషన్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్న నాగార్జున చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ ట్వీట్‌కు సుమంత్ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్స్ చినమామ’’ అని కామెంట్ చేశారు.

ఒక్క హిట్టు కోసం పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడుతున్న సుమంత్ ఈసారి క్రైమ్ డ్రామాని సబ్జెక్టుగా ఎంచుకున్నాడు. కన్నడంలో హిట్టైన ‘కవలుదారి’ చిత్రాన్ని తెలుగులో ‘కపటదారి’గా తెరకెక్కిస్తున్నారు. మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే పొలిటికల్ డ్రామాగా ఈ చిత్రం రానుంది. కపటదారి లో సుమంత్ ట్రాఫిక్ పోలిస్ పాత్ర చేస్తున్నారు.నాజ‌ర్‌, నందిత‌, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్రకాశ్‌, సంప‌త్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. సైమ‌న్ కె. కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. కపటదారి చిత్రంతోనైనా సుమంత్ హిట్ కొట్టాలని ఆశిద్దాం.

సంబంధిత సమాచారం :

More