50 రోజులు కంప్లీట్ చేసుకున్న సంక్రాంతి హిట్స్.!

Published on Mar 1, 2023 3:40 pm IST

మన టాలీవుడ్ సహా కోలీవుడ్ లో కూడా ఈ ఏడాది సంక్రాంతి మంచి రసవత్తరంగా వచ్చింది అని చెప్పాలి. ఇద్దరు పెద్ద తారల సినిమాలు మన దగ్గర ఒకరోజు వ్యవధి లో రాగ అక్కడైతే ఒకేరోజు వచ్చాయి. దళపతి విజయ్ అలాగే నటుడు అజిత్ ల క్రేజ్ తమిళ నాట నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి ఇద్దరూ తమ పీక్ లో ఉన్నపుడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అనేది సౌత్ ఇండియా సినిమా దగ్గర ఒక ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్ గా అయితే నిలిచింది.

మరి ఈ భారీ పోటీ లో వచ్చిన రెండు సినిమాలు కూడా ఇప్పుడు పెద్ద సక్సెస్ సాధించి 50 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకోవడం మరో ఆసక్తికర అంశంగా నిలిచింది. అలాగే రెండు సినిమాలు కూడా ఆల్రెడీ ఓటిటి లో ఉన్నప్పటికీ ఈ సినిమాలు థియేట్రికల్ గా 50 రోజులు కంప్లీట్ చేసుకోవడం ప్రస్తుత రోజుల్లో మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇక విజయ్ “వారిసు” సినిమాని అయితే మన టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించగా అజిత్ సినిమా “తునివు” ని దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించాడు.

సంబంధిత సమాచారం :