“సర్కారు వారి పాట” నుంచి దాదాపు ఈ ట్రీటే అట.!

Published on May 11, 2021 9:00 am IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే సెట్టయ్యాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి ఈ నెల ఆఖరున మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఓ అప్డేట్ కన్ఫర్మ్ అయ్యిన సంగతి తెలిసిందే.

మరి అది ఏంటి అన్న దానిపై అనేక రకాల ఊహాగానాలు ఉన్నాయి. కానీ ఆ రోజు ట్రీట్ జస్ట్ పోస్టర్ తోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది మే 31 న ప్రీ లుక్స్ పోస్టర్ రిలీజ్ చెయ్యగా ఈసారి సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చెయ్యనున్నారట. మరి ఈసారి వచ్చేది అదెనా లేక వేరే ఏమన్నా ఉందా అన్నది వేచి చూడాలి. మరి ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :