వైరల్ – బాలీవుడ్ లో మహేష్ బాబు క్రేజ్ ఇది..!

Published on Mar 3, 2021 1:00 pm IST

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్షిణాదిన అలాగే ఓవర్సీస్ మార్కెట్ లో ఎలాంటి క్రేజ్ ఉందో తన సినిమాలు ఓపెనింగ్స్ చూస్తేనే అన్నీ క్లియర్ అవుతాయి. కానీ మహేష్ బాబుకు మాత్రం ఎప్పటి నుంచో బాలీవుడ్ వర్గాల్లో కూడా మాంచి క్రేజ్ ఉంది. అయితే అది అక్కడి ప్రేక్షకుల నుంచే కాదు అక్కడ ఉన్న స్టార్ నటుల్లో కూడా..మరి అలాంటి ఓ సందర్భమే కేవలం అంటే కేవలం మహేష్ పైనే బయటకు వచ్చింది.

అక్కడి స్టార్ హీరోయిన్ అయినటువంటి పరిణీతి చోప్రా తన లేటెస్ట్ సినిమా “ది గర్ల్ బిహైండ్ ఆన్ ది ట్రైన్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ పై చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాను మాట్లాడుతూ మహేష్ తో వర్క్ చెయ్యాలని ఉందని తన నటన కానీ మహేష్ లుక్స్ కానీ చాలా ఇష్టమని చెప్పింది.

మరి అంతే కాకుండా సౌత్ ఇండియా నుంచి మరో వేరే ఏ హీరోతో అయినా చేస్తారా అంటే తనకు తెలుగు రాకపోయినా సరే ఒక్క మహేష్ తో తప్ప ఇంకెవరితోనూ నటించను అని చెప్పేసింది ఈ హీరోయిన్. దీనిని బట్టి బాబు హవా అక్కడ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ ఇంటర్వ్యూ జరిగి వారం దాటినా ఇప్పుడు ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరి ఈ లెక్కన ఇప్పుడు మహేష్ చేస్తున్న “సర్కారు వారి పాట”ను మెల్లగా అక్కడ రిలీజ్ ప్లాన్ చేసినా మినిమమ్ ఉంటుందని చెప్పాలి. పైగా తర్వాత రాజమౌళితో చేసే సినిమాకు కూడా మంచి పునాదిలా కూడా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మాత్రం పరిణీతి చోప్రా మాటలు మహేష్ ఫ్యాన్స్ కు మంచి హై ను ఇస్తున్నాయి. ప్రస్తుతం పరిణీతి చేసిన “సైనా నెహ్వాల్” సినిమా గ్లింప్స్ కు మంచి ఆదరణ వస్తుంది. మీకు ఆ క్లిప్ కావాలి అంటే యూట్యూబ్ బిహైండ్ వుడ్స్ ఛానెల్లో దొరుకుతుంది.

సంబంధిత సమాచారం :