రేపు బాలయ్య నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదే.!

Published on May 27, 2021 10:18 am IST

గత మే 20 వ తారీఖు నుంచి నందమూరి అభిమానులు సాలిడ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. తారక్ నుంచి మొదలు కొని నిన్న కళ్యాణ్ రామ్ సాలిడ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ తో మంచి హై ఇచ్చారు. ఇక ఇదిలా ఉండగా రేపు నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా బాలయ్య నుంచి ఒక ఒక ట్రీట్ ఉందని టాక్ వచ్చింది. మరి అది కాస్తా ఇప్పుడు ఎట్టకేలకు రివీల్ అయ్యిపోయింది.

ఆరోజున బాలయ్య నుంచి స్వయంగా తాను ఆలపించిన శ్రీరామ దండకం ను 9 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ వారు తెలిపారు. మరి అది ఎలా ఉండనుందో రేపటి వరకు ఆగి చూడాల్సిందే. అయితే సర్ప్రైజ్ అంటే ఇప్పుడు బాలయ్య నటిస్తున్న భారీ చిత్రం “అఖండ” నుంచి కూడా సరికొత్త అప్డేట్ ను అంతా ఆశించారు. మొత్తానికి ఒకటి ఫిక్స్ అయ్యింది మరి ఆ అప్డేట్ కూడా వస్తుందో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :