బిగ్ బాస్ 4 – ఈ వారమే బాగా బోరింగ్ గా ఉందట.!

బిగ్ బాస్ 4 – ఈ వారమే బాగా బోరింగ్ గా ఉందట.!

Published on Nov 28, 2020 8:17 PM IST

Bigg 1
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదొక అంశంపై అలా చర్చ నెటిజన్స్ నడుమ నడుస్తుంది. అలాగే గత కొంత కాలం వరకు ఒక సమయం వరకు ఐపీఎల్ కోసం ఆ తర్వాత స్టార్ట్ అయ్యే బిగ్ బాస్ కోసం చర్చించుకునే వారు. కానీ ఈ సారి ఆ రెండిటికి పెద్ద గ్యాప్ లేకుండానే వచ్చేశాయ్. ఐపీఎల్ ఎలాగో అయ్యిపోయింది.

దీనితో మన తెలుగు ఆడియెన్స్ అటెన్షన్ అంతా బిగ్ బాస్ సీజన్ 4 పై పడింది. ఆల్రెడీ ఫైనల్స్ కు చేరుకుంటున్న ఈ గ్రాండ్ రియాలిటీ షోకు సంబంధించి ప్రతీ రోజు చర్చ నడుస్తూనే ఉంటుంది. అలా ఈసారి అసలు ఈ సీజన్లోనే ఈ వారం జరిగిన వీక్ ఎపిసోడ్స్ అసలేం బాలేవని నెటిజన్స్ పెదవి విరిచేసారు. అయితే వారి అభిప్రాయంలో నిజం లేకపోలేదు.

సీజన్ స్టార్ట్ అయిన కొన్ని రోజులకే ఆడియెన్స్ నిరాశ వ్యక్తం చేసారు. దీంతో వెంటనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో గ్రాఫ్ పెంచారు. అంతా ఓకే అనుకుంటే ఈసారి సీజన్లో మాత్రం ముఖ్యంగా ఈ వారమే చెప్పుకోదగ్గ రేంజ్ లో ఏం లేదు అని అనేస్తున్నారు. అంత ఇంట్రెస్టింగ్ గా లేని టాస్కులు కంటెస్టెంట్స్ మధ్య కూడా పెద్దగా గొడవలు లేకపోవడం వంటివి వీక్షకులకు ఈ వారం పరమ బోరింగ్ గా అనిపించాయని అనేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు