ఈ వారం అంతా చిన్న సినిమాలదే…!

Published on Aug 21, 2019 6:20 pm IST

అదును చూసుకొని చిన్న సినిమాలు బాక్సాఫీస్ పై దండెత్తాయి. ఒకే రోజు 12 సినిమాలు ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ వారం చెప్పుకోదగ్గ పెద్ద సినిమాల విడుదల లేకపోవడంతో చిన్న చిత్రాలన్ని 23నే తమ విడుదల తేదీగా మార్చేసుకున్నాయి. వీటిలో క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన కౌశల్య కృష్ణమూర్తి మాత్రమే పెద్ద చిత్రంగా విడుదలవుతుంది. ఇక దీనితో పాటు, సీనియర్ కమెడియన్ అలీ నటించిన “పండుగాడి ఫోటో స్టూడియో”, షకలక శంకర్ నటించిన నేనే కేడి నంబర్ వన్, దండుపాళ్యం సిరీస్ లో వస్తున్న దండుపాళ్యం 4, అశ్వమేధం, ఉండిపోరాడే, నివాసి మాత్రమే కొంచెం అంచలనాల మధ్య విడుదలవుతున్న చిత్రాలు.

ఇక వీటితో పాటు ఏదైనా జరగొచ్చు, హవా,బాయ్, జిందా గ్యాంగ్,నీతోనే హాయ్ హాయ్ చిత్రాలు కూడా విడుదల అవుతున్నాయి. పెద్ద చిత్రాల విడుదల లేని వారాలలో మాత్రమే చిన్న సినిమాలకు థియేటర్స్ దొరుకుతూ ఉంటాయి. అందుకే చిన్న చిత్రాలన్నీ ఒకే సారి మూకుమ్మడిగా 23న విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం :