గత శుక్రవారం రిలీజ్ అయినా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయాయి. ఈ సినిమాలకి నెగిటివ్స్ రివ్యూస్ ఎక్కువగా రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాలని చూడడానికి ఆసక్తిని చూపించటంలేదు. ఈ శుక్రవారం మరో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి .
వాటిలో మొదటిది నాగార్జున -వర్మ కలయికలో తెరకెక్కిన ‘ఆఫీసర్’. ఈ చిత్రం ఫై నాగ్ కాన్ఫిడెంట్ గానే వున్నాడు . ఇక తరువాతి చిత్రం విశాల్ నటించిన అభిమన్యుడు. ‘ఇరుంబు తేరై’ గా తమిళ్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి రివ్యూస్ ని సొంతం చేసుకొని విశాల్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ ని సాధించి దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది. తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో వస్తున్న ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు విశాల్.
ఇక మూడవ సినిమా రాజ్ తరుణ్ నటించిన ‘రాజు గాడు’. నూతన దర్శకురాలు సంజన రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా విజయం సాధించడం రాజ్ తరుణ్ కి చాలా అవసరం. ఈ మూడు సినిమాలు ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా అనివార్యకరణాలవల్ల వాయిదా పడి ఒకే సారి విడుదలవుతున్నాయి . మరి ఈ మూడు సినిమాలలో ఏ చిత్రం ప్రేక్షకులను అక్కట్టుకుంటుందో చూడాలి.


