ఈ వీకెండ్ రిలీజ్ కాబోతున్న సినిమాలు ఏవేవంటే?

Published on Aug 11, 2021 2:00 am IST

కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడ్డ సినిమా థియేటర్లు జూలై 30నుంచి తెరుచుకోవడంతో చిన్న చిన్న సినిమాలన్ని ఒక్కొక్కటిగా విడుదల అవుతూ వస్తున్నాయి. జూలై 30న తిమ్మరుసు, ఇష్క్‌లతో కలిపి ఐదు సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కేవలం తిమ్మరుసు మూవీ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక ఆగష్టు ఫస్ట్ వీక్‌లో మొత్తం ఏడు సినిమాలు రిలీజ్ కాగా ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది.

అయితే ఇక ఈ వీకెండ్‌లో ఏకంగా 10 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆగస్టు 13న సుందరి, బ్రాందీ డైరీస్, సలామ్ నమస్తే, చైతన్యం, కనబడుట లేదు వంటి చిత్రాలతో పాటుగా తమిళ డబ్బింగ్ సినిమా ‘ఒరేయ్ బామ్మర్ది’, ఆంగ్ల అనువాద చిత్రం ‘ది కంజురింగ్’ సినిమాలు రాబోతున్నాయి. వీటితో పాటు అగష్టు 14వ తేది మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన “పాగల్” మరియు ఆర్. నారాయణ మూర్తి ‘రైతన్న’ సినిమాలు సందడి చేయబోతున్నాయి.

సంబంధిత సమాచారం :