నెట్‌ప్లిక్స్‌లో ఈ వీకెండ్ సందడి చేసే సినిమాలివే..!

Published on Jul 9, 2021 1:37 am IST

కరోనా కారణంగా థియేటర్లు మూతపడడంతో ఎంటర్‌టైన్మెంట్‌ను కోరుకునే వారికి కేరాఫ్ అడ్రస్‌లుగా ఓటీటీలు నిలబడ్డాయని చెప్పవచ్చు. ఆన్‌లైన్ దిగ్గజాలలో ఒకటైన నెట్‌ప్లిక్స్ ఎప్పటికప్పుడు డిఫ‌రెంట్ జోన‌ర్ సినిమాల‌తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంలో ముందంజలో ఉంటుంది. అయితే ఈ వీకెండ్ కూడా నెట్ ఫ్లిక్స్ సరికొత్త చిత్రాలను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతుంది.

అయితే త‌రుణ్ భాస్క‌ర్, బీవీ నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో వచ్చిన “పిట్ట కథలు” , నాలుగు రకాల అంద‌మైన క‌థ‌ల‌తో సాగే చిత్రం “కేరాఫ్ కంచ‌ర‌పాలెం”, కీర్తి సురేశ్ కథానాయికగా చేసిన “మిస్ ఇండియా”, సత్యదేవ్ హీరోగా మ‌ల‌యాళ రీమేక్‌గా తెర‌కెక్కిన “ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య‌”, “సినిమా బండి”, “అ:”, తాప్సీ లీడ్ రోల్‌లో, అశ్విన్ శ‌ర‌వ‌ణ‌న్ తెర‌కెక్కించిన థ్రిల్ల‌ర్ హార్ర‌ర్ డ్రామా “గేమ్ ఓవ‌ర్” మొదలైన సినిమాలు ఈ వీకెండ్ మిమ్మల్ని అలరించబోతున్నాయి.

సంబంధిత సమాచారం :