టాక్..మళ్ళీ డైలమాలో పవన్ సినిమా..?

Published on Jul 2, 2022 7:05 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు తన సినిమాలు అలాగే రాజకీయాల్లో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో అయితే ఆల్రెడీ తాను రెండు రీమేక్ సినిమాలు చేసి హిట్ అందుకోగా ఇప్పుడు మూడో రీమేక్ ని లైన్ లో పెట్టుకున్నారు. అయితే పవన్ ఇప్పుడు నటించడానికి సిద్ధం అయిన చిత్రమే తమిళ్ హిట్ సినిమా వినోదయ సైతం. మరి ఈ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వం వహించనుండగా మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.

అయితే గోపాల గోపాల తరహాలో పవన్ ఒక లిమిటెడ్ గెస్ట్ రోల్ లో కనిపించనున్న ఈ చిత్రం రీసెంట్ గానే ముహూర్తం కూడా జరిపేసుకుంది. మరి ఇదంతా బాగానే ఉన్నా పవన్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు విషయంలో మాత్రం ఇంకా సస్పెన్సు కొనసాగుతుందట. పవన్ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే డైలమా మళ్ళీ స్టార్ట్ అయ్యినట్టుగా టాక్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :